అయ్య బాబోయ్..ఈ స్కూటర్ కు మ్యాజిక్ వస్తుందా?

-

  1. మాములుగా ఏదైనా వాహనాన్ని మనం నడిపితేనె నడుస్తాయి..కొన్ని పెద్ద వాహానాలు అయితే ఆటోమేటిక్ ఉంటాయి. కానీ స్కూటర్ దానంతట అది కదలడం ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా?..స్కూటర్ అలా కదలదు..మ్యాజిక్ వస్తే తప్ప మనిషి లేకుండా స్కూటర్ ముందుకు జరగదు..ఇప్పుడు ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.. ఆ వీడియో లో ఓ స్మార్ట్ స్కూటర్ రోడ్డు పార్క్ చేసి ఉంటుంది. అయితే కొద్ది సేపటి తర్వాత దానంతట అది ముందుకు కదులుతుంది.ఆ తర్వాత తిరిగి మళ్ళీ యదా స్థానానికి వెళుతుంది.

అక్కడ ఉండే సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.ఈ షాకింగ్ వీడియో చూసిన నెటిజన్లు దీనిని దెయ్యం స్కూటర్‌గా పిలుస్తున్నారు. ఈ వీడియోని ఇప్పటివరకు 1 మిలియన్ కంటే ఎక్కువ మంది చూశారు. 43 వేల మందికి పైగా లైక్‌ చేశారు. అదే సమయంలో నెటిజన్లు వివిధ రకాల రియాక్షన్‌లు ఇస్తున్నారు. ఈ ఘటనను కొందరు అద్భుతం అని, మరికొందరు దెయ్యం చేసిందని కామెంట్ చేస్తున్నారు..ఏది ఏమైనా కూడా ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇలాంటి వింతలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. ఏది నిజమో, ఏది మ్యాజిక్ నో జనాలకు అర్థం కావడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version