Second danger alert at Dhavaleswaram barrage: ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పలు జిల్లాల్లో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పలు ప్రాజెక్టులలో భారీగా నీరు చేరడంతో కాలువలు, చెరువులు నిండిపోతున్నాయి. కొన్ని నగరాలలో కాలువ ఆనకట్టలు తెగడం వల్ల ప్రజల ఇళ్లలోకి నీరు చేరి నగరాలన్నీ జలమయం అవుతున్నాయి. తాజాగా మరోసారి ఏపీలో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ధవళేశ్వరం వద్ద భారీగా వరద వచ్చి చేరడంతో ప్రజలు ఆందోళనలో పడుతున్నారు.
నీటిమట్టం 13.75 అడుగులకు చేరడం వల్ల రెండో ప్రమాద హెచ్చరికను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. 13 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి చేరుతోంది. దీంతో నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గోదావరి ప్రవాహ ఉధృతి దృష్ట్యా గణేష్ విగ్రహాల నిమజ్జనం రానున్న 48 గంటల పాటు నిర్వహించకూడదని సూచించారు.