కాంగ్రెస్‌కు రెండో ప్లేస్ డౌటేనా..సునీల్ సర్వే కలకలం.!

-

కాంగ్రెస్ పార్టీకి శత్రువు కాంగ్రెస్ పార్టీనే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పార్టీని వేరే పార్టీ వాళ్ళు దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉండదు. కాంగ్రెస్ నేతలే..కాంగ్రెస్ పార్టీని దెబ్బకొడతారు. అందుకే తెలంగాణలో రాజకీయంగా బలపడేందుకు మంచి మంచి అవకాశాలు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోలేకపోయింది. టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతని సరిగా వాడుకుని బలపడలేదు.

బీజేపీ చక్కగా వాడుకుంది…బలపడింది. ఇక సొంత పార్టీలోని లుకలుకలతో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి దిగజారుతూ వస్తుంది. ఆఖరికి బలంగా ఉన్న మునుగోడులో కూడా కాంగ్రెస్ పరిస్తితి దిగజారుతుందంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ సీటు..కోమటిరెడ్డి రాజగోపాల్ పార్టీని వదిలి..బీజేపీలోకి వెళ్ళినా సరే కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్‌ని వదలలేదు. ఏదో కొంతమంది మాత్రం పార్టీని వీడారు. కోమటిరెడ్డి వెళ్ళే సరికి మునుగోడులో పార్టీ బలంగానే ఉంది.

కానీ అక్కడ ఇప్పటికీ అభ్యర్ధిని ఖరారు చేయకపోవడం, పెద్ద నాయకులు ఎవరు మునుగోడులో మకాం వేయకుండా పనిచేయకుండా ఉండటం, ద్వితీయ శ్రేణి నేతలని పట్టించుకోకపోవడం, పైగా అంతర్గతంగా కుమ్ములాటలు ఎక్కువ ఉండటంతో…మునుగోడులో దాదాపు 40 శాతం కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ లేదా టీఆర్ఎస్ వైపు వెళ్లిపోయారని తాజాగా వ్యూహకత్ర సునీల్ సర్వేలో తేలిందట.

ఓ వైపు టీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్ధులని ఫిక్స్ చేసి బరిలో ఉన్నాయి..అలాగే రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు మునుగోడులో మకాం వేసి పనిచేస్తున్నారు. కానీ కాంగ్రెస్‌లో ఆ పరిస్తితి లేదు. ఇప్పటికీ వారు ఢిల్లీ చుట్టూనే తిరుగుతున్నారు. అభ్యర్ధి ఎంపికపై చర్చలు చేస్తున్నారు. ఇక ఈలోపు కాంగ్రెస్ శ్రేణులు తమ దారి తాము చూసుకుంటున్నారు. అలాగే ఉన్నవారిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి..తన సోదరుడుకు మద్ధతు తెలిపేలా రాజకీయం నడుపుతున్నారని తెలిసింది. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే మునుగోడులో గెలవడం కాదు..ఆఖరికి రెండోస్థానం కాకుండా మూడో స్థానానికి పడిపోయే ప్రమాదం ఉందట, మరి ఇప్పటికైనా కాంగ్రెస్ మేలుకుంటుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version