ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు నెమ్మదిగా కంట్రోల్ లోకి వస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ క్రమంలో మరింత అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వైరస్ కు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికీ ఏపీ వ్యాప్తంగా పాఠశాలలు కళాశాలలు ఓపెన్ చేసిన కారణంగా ఎప్పటి కప్పుడు విద్యార్థులకు అలాగే లెక్చరర్లకు టీచర్లకు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి అందరికీ ఈ టెస్ట్ లు చేస్తూ వెళుతున్నాను.
ఏపీలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విధానం నడుస్తోంది. త్వరలోనే కరోనా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. తొలి విడతలో కోటి మందికి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోల్డ్ ఛెయిన్లు రెడీ చేసుకునే విషయం మీద ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. మొత్తం 4165 ఎక్విప్‌మెంట్ అవసరమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. వాక్సీన్ వేసేందుకు 19వేల మంది ఏఎన్‌ఎంలు, వాక్సీన్ రవాణాకు 29 రిఫ్రిజిరేటెడ్ వాహనాలు కావాలని ప్రభుత్వం భావిస్తోంది.