ఢిల్లీలో రైతుల నిరాహార దీక్ష..మద్దతుగా సిఎం కూడా !

-

18వ రోజు ఉధృతంగా సాగిన రైతుల ఆందోళన 19 వ రోజుకు చేరింది. రైతుల్ని బుజ్జగించేందుకు కేంద్రం ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ఈరోజు ఢిల్లీ శివారులోని సింఘు బోర్డర్‌ వద్ద నిరాహార దీక్షకు దిగారు రైతులు. డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 19 వరకు రైతులు గడువిచ్చారు. ఢిల్లీ సరిహద్దులు దిగ్బంధం చేయాలని రైతు సంఘాల నిర్ణయం తీసుకున్నాయి.  వారికి మద్దతుగా ఢిల్లీ సీఎం కేజీవ్రాల్ నిరాహార దీక్షకు దిగారు. 

గత మూడు వారాలుగా వేలాది మంది పంజాబ్‌,హర్యానా రైతులు నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే వారి ఉద్యమానికి మద్దతు ప్రకటించిన కేజ్రీవాల్‌ ఈరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ప్రజలందరూ రైతులకు మద్దతుగా నిరాహార దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు కేజ్రీవాల్‌. మరో పక్క రైతులకు మద్దతు ప్రకటించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై పంజాబ్‌ సీఎం కెప్టెన్ అమరీందర్‌ సింగ్‌ విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్‌ చీప్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ కనుసన్నల్లో కేజ్రీవాల్‌ పనిచేస్తున్నారని ఆరోపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version