కోవిడ్ వైరస్ ఎప్పటికప్పుడు లక్షణాలు మార్చుకుంటూ విరుచుకుపడుతోంది. తొలిదశలో జ్వరం, జలుబు సహా సాదారణ లక్షణాలు కనిపించగా.. సెకండ్ వేవ్‌లో మరిన్ని కొత్త లక్షణాలతో వైరస్ విస్తరిస్తోంది. తొలిదశ, రెండోదశ వైరస్‌ల మధ్య స్పష్టమైనతేడా కనిపిస్తోంది. తొలిదశ లక్షణాలకు తోడు రెండోదశలో మరిన్ని సింప్టమ్స్ కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే సెకండ్ వేవ్ తొలిదశతో పోలిస్తే లక్షణాలు,వయస్సు సహా చాలా అంశాల్లో కాస్త విభిన్నంగా కనిపిస్తోంది.
దేశంలో కరోనా తొలిదశలో లోకల్ ముటేషన్స్…ప్రధాన పాత్ర పోషించలేదు. అయితే ఈ దశలో మాత్రం అవి కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఢిల్లీలో 65 శాతం కేసులు 45 ఏళ్లలోపువారికే వచ్చినట్లు కేజ్రీవాల్ తెలిపారు.తొలిదశ విజృంభణ కొనసాగుతున్న తరుణంలో పెద్దవారి ఆరోగ్యంపై అధికశ్రద్ధ చూపించడం జరిగింది. వ్యాక్సినేషన్‌తో పాటు వారు హోమ్ క్వారంటైన్ కావడంతో వారిలో రిస్క్ శాతం తగ్గింది. అయితే యువకులు ఎకనమిక్ కార్యకలాపాల్లో పాల్గొనడంతో వీరిపై కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతున్నట్లు తేలింది.
కేంద్రం లెక్కల ప్రకారం ఐదు రాష్ట్రాల్లోనే 80 వేల మంది చిన్నారులు కోవిడ్ బారినపడ్డారు. తొలిదశ లక్షణాలకు తోడు రెండోదశలో మరిన్ని సింప్టమ్స్ కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. జ్వరం, చలి, ఒళ్లునొప్పులు, వాసన,రుచి కోల్పోవడం, శ్వాసకోస వ్యవస్థ సమస్యలతో తొలిదశ ఇబ్బందిపెట్టింది. అయితే రెండోదశలో వీటికి తోడు కళ్లు గులాబీరంగులోకి మారడం, లూజ్ మోషన్స్, చెవులు సరిగ్గా వినిపించకపోవడం తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి.