షాకింగ్‌.. సికింద్రాబాద్‌ అలర్ల నిందితులకు యావజ్జీవ శిక్ష..!

-

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అగ్నిపథ్‌ స్కీంకు వ్యతిరేకంగా నిరసన జ్వాలులు రగులుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న అల్లర్లపై దర్యాప్తును వేగవంగం చేశారు రైల్వే పోలీసులు. ఈ సందర్భంగా రైల్వే ఎస్పీ అనురాధ మాట్లాడుతూ.. అగ్నిపథ్‌ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి పాల్పడిన వారిలో ఇప్పటివరకు 46 మందిని అరెస్టు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ ఘటనలో మిగిలిన వారికోసం గాలిస్తున్నామని, ఆర్మీ అభ్యర్థుల వాట్సాప్‌ గ్రూపుల్లో వచ్చిన మెసేజ్‌ల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేసి అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నామమని ఆమె పేర్కొన్నారు.

పోలీసులు, ప్రయాణికులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారని, రెండు వేల మంది ఆందోళనల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. అభ్యర్థులను రెచ్చగొట్టిన కోచింగ్ సెంటర్లను గుర్తించామని ప్రకటించారు. వాట్సాప్ గ్రూపుల్లో చర్చించి దాడికి పాల్పడ్డారని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్లలో.. అరెస్టైన వారంతా తెలంగాణ వాళ్లేనని వెల్లడించారు. అంతేకాకుండా రైల్వే యాక్ట్ 150 కింద నిందితులకు యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు అనురాధ.

Read more RELATED
Recommended to you

Exit mobile version