ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అస్సలు పర్ ఫార్మ్ చేయని ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది మ్యాక్స్ వెల్ అనే చెప్పాలి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడుతున్న మ్యాక్స్ వెల్, ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచుల్లో కేవలం 48పరుగులు మాత్రమే చేయగలిగారు. ఈ విషయమై మ్యాక్స్ వెల్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ సైతం మ్యాక్స్ వెల్ ఆటతీరుపై విమర్శలు చేసాడు. సెహ్వాగ్ మాట్లాడుతూ, మ్యాక్స్ వెల్ సరిగ్గా ఆడడానికి ఏ వేదిక సరిపోతుందో అర్థం కావడం లేదు.
సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచులో అతడు ఆడడానికి వచ్చినప్పుడు చాలా ఓవర్స్ మిగిలి ఉన్నాయి. అయినా కూడా సరిగ్గా ఆడలేదు. అంతకుముందు మ్యాచుల్లో బ్యాటింగ్ కి వచ్చినపుడు ఎక్కువగా ఓవర్లు లేవు. అప్పుడూ ఆడలేదు. 11కోట్లు తీసుకున్న ఆటగాడు ఇలా ప్రతీసారి విఫలం అవుతూంటే వచ్చే ఏడాది వరకి కోటి రూపాయలకి వచ్చేస్తాడని అన్నాడు. అయినా ఐపీఎల్ ఫ్రాంఛైజీలన్నీ మ్యాక్స్ వెల్ అనగానే ఎందుకంత ఉత్సాహం చూపిస్తాయో అర్థం కాదన్నాడు.