వార్నర్‌పై సెహ్వాగ్‌ అసహనం.. ఏమన్నాడంటే..?

-

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పై మాజీ భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు చేపట్టారు. వార్నర్ కెప్టెన్సీపై, ఆటతీరు పై సెహ్వాగ్ అసహనం వ్యక్తపరిచారు. కెప్టెన్సీ చేయడం రాకపోతే..వేగంగా పరుగులు చేయడం చేతకాకపోతే ఐపీఎల్ ఆడొద్దని కాస్త కఠినమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సీజన్లో లో డేవిడ్ వార్నర్ చాలా నిదానంగా ఆడుతున్నాడని అని తెలిపారు సెహ్వాగ్. 25 బంతుల్లో 50 పరుగులు చేయాలి కానీ..నెమ్మదిగా ఆడొద్దని అన్నారు. అందుకే వార్నర్ కు చెప్తున్నానని..అతనికి బాధ కలిగినా సరే చెప్పక తప్పదని అన్నారు. వార్నర్..ఉత్తమ ఆటతీరు ప్రదర్శించు అని సెహ్వాగ్ వార్నర్ కి చెప్పారు. యశస్వీ జైస్వాల్ ను చూసి వార్నర్ నేర్చుకోవాలని అన్నారు. వేగంగా ఆడకపోతే మాత్రం ఐపీఎల్ ఆడొద్దన్నాడు. 55 బంతుల్లో 65 పరుగులు చేయడం కన్నా..30 పరుగులే చేసి ఔటైతే జట్టుకు మేలు అని సూచించారు. ఆ తర్వాత వచ్చే బ్యాట్స్ మెన్ అయినా వేగంగా ఆడతారని చెప్పుకొచ్చాడు. దాని వల్ల ఫలితం మారే అవకాశం ఉందన్నాడు సెహ్వాగ్.

ఇంతకుముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిపిన వార్నర్..ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. అయితే రిషబ్ పంత్ ప్రమాదం కారణంగా దూరం కావడంతో..వార్నర్ ఢిల్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. వార్నర్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్..ఆడిన మూడు మ్యాచుల్లోనూ పరాజయం పాలైంది. అటు కెప్టెన్సీలో విఫలమైన వార్నర్..దూకుడైన ఆటతీరును కనభర్చడంలో విఫలమయ్యాడు. కాగా, వార్నర్ కెప్టెన్సీ, సారథ్యంపై విమర్శలు చేశాడు సెహ్వాగ్.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version