వన్ డే వరల్డ్ కప్ మరో రెండు నెలల్లో ఇండియాలోని పది వేదికలలో జరగనుంది. గతంలో 2011 లో వరల్డ్ కప్ జరుగగా, మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ లో ఇండియా వరల్డ్ కప్ ను ముద్దాడింది. ఇప్పుడు పది సంవత్సరాల అనంతరం మళ్ళీ ఒక అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందంటూ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ వరల్డ్ కప్ గురించి మాజీ ఇండియా ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒక యు ట్యూబ్ ఛానెల్ తో ఇంటర్వ్యూ లో ఉండగా .. యాంకర్ ఈ వరల్డ్ కప్ లో ఎవరు టాప్ స్కోరర్ గా నిలుస్తారని సెహ్వాగ్ ని ప్రశ్నించగా.. అందుకు సెహ్వాగ్ నా మనసులో కొందరి ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. కానీ నేను ఇండియా కు చెందినవాడిని కాబట్టి.. రోహిత్ శర్మ ఈ వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ గా నిలుస్తాడు అంటూ చెప్పాడు.
వరల్డ్ కప్ లో అతనే టాప్ స్కోరర్ : వీరేంద్ర సెహ్వాగ్
-