ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ని ఏ విధంగా ఎదుర్కోవాలో అర్ధం కాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. ఇక లాక్ డౌన్ కారణంగా ప్రజలు కూడా చాలా అవస్థలు పడుతున్న నేపధ్యంలో వారి ఇబ్బందులను కూడా తొలిగించాలి అని జగన్ సర్కార్ భావిస్తుంది. ఈ నేపధ్యంలోనే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.
ఎవరైనా సరే అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే ఓలా క్యాబ్స్ ని వాడుకునే విధంగా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఈ సౌకర్యం విశాఖ నగరంలో మాత్రమే ఉంది. తర్వాత మిగిలిన నగరాలకు ఇది విస్తరించే ఆలోచనలో ఉంది ఏపీ సర్కార్. ఇక అత్యవసర వైద్య రవాణా సేవలను అందించడానికి సంస్థ ముందుకి రావడం తో రవాణా శాఖ పోలీస్ శాఖ దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకున్నాయి.
త్వరలోనే మిగిలిన నగరాలకు విస్తరించి ప్రజల ఇబ్బందులను తొలగించే ఆలోచన చేస్తున్నారు. డయాలసిస్, గుండెజబ్బులు, క్యాన్సర్ తదితర రోగులకు దీనిని వాడుకునే అవకాశాలు ఉన్నాయి. కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే ఓలా క్యాబ్స్‌లోకి అనుమతించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏ సేవలు పడితే ఆ సేవలు కాదు… ఇంటి నుంచి ఆస్పత్రికి ఆస్పత్రి నుంచి ఇంటికి మాత్రమే. ఓలా క్యాబ్ లో డ్రైవర్ కాకుండా మరో ఇద్దరికే అనుమతి ఇస్తారు.