ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేతులెత్తేసారా…? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం మీద ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే అనూహ్యంగా దాదాపు రాయలసీమ ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా విశాఖ, శ్రీకాకుళం ,విజయనగరం జిల్లాల్లో కూడా ఏకగ్రీవాలు అవ్వటంతో తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో చేతులెత్తేసినట్టు సమాచారం.
నియోజకవర్గ నేతలు కూడా పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయటం లేదు. రాజకీయంగా బలంగా ఉన్న అధికార పార్టీని ఎదుర్కోవటం వారికి కూడా కష్టంగా మారింది. ఇక తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించిన నేతలు కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకి పలు సూచనలు చేసినట్లు సమాచారం. గొడవలు జరగని చోట జరుగుతుందని అనవసరంగా, ఇప్పుడు హైరానా పడిన ఉపయోగం లేదని జగన్ అత్యంత బలంగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం కూడా లేదని, చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో బలపడాలి అనే ప్రయత్నం చేయటం ఇప్పుడు అనవసరమని చెప్పారట.
రాయలసీమలో పూర్తిగా పట్టు కోల్పోయామని ఉత్తరాంధ్రలో కూడా అదే పరిస్థితి ఉందని అయితే విజయవాడ, గుంటూరు నగరాల్లో తమ సత్తా చూపిస్తామని గోదావరి జిల్లాల్లో కూడా గ్రౌండ్ అంతా క్లియర్ చేసుకున్నారని ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని చెప్పారట. కాబట్టి ఇప్పుడు మీడియా సమావేశాలకి కూడా దూరంగా ఉంటే మంచిది అంటూ చంద్రబాబుకి సలహా ఇస్తున్నారు. మనం ఎంత రెచ్చిపోతే జగన్ అంతమందిని వైసీపీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తారని ఉన్నవారిని కాపాడుకోవాలంటే సైలెంట్ అవ్వటం మంచిది అనే సూచనలు కూడా టిడిపి నేతలు చంద్రబాబుకు చేశారట.