టీ ఆర్ ఎస్ పార్టీని బ్రహ్మ దేవుడు కూడా కాపాడ లేడని సంచలన వ్యాఖ్యలు చేశారు బిజేపి పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. నెక్స్ట్ టార్గెట్ కెసిఆర్ కెసిఆర్ ని ఓడగొట్టడమే నా జీవిత లక్ష్యమన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ క్యాంపు ఆఫీస్ లో ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ…రెసిడెన్సీ స్కూల్స్ మొత్తం అద్మణంగా తయారయ్యాయని…ప్రతి రోజు ఎక్కడో దగ్గర విద్యార్థులకు అశ్వస్థతలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులు తినే ఆహారం లో వాణపాములు బొద్దింకలు వస్తున్నాయ్… కాంట్రాక్టర్ లకు డబ్బులు ఇవ్వకపోవడం తో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తలేరని మండిపడ్డారు. మంత్రులు స్వతంత్రగా తిరిగి పర్యవేక్షణ చేసే పరిస్థితి లేదు…ఫామ్ హౌస్ లేకుంటే ఢిల్లీలో ఉండే ముఖ్యమంత్రి కనీసము పర్యవేక్షణ చేసే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు ఈటల రాజేందర్. తెలంగాణ రాష్ట్రంలో బిజెపితో అధికారమని స్పష్టం చేశారు.