వన్ నేషన్-వన్ ఎలక్షన్ పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా వన్ నేషన్- వన్ ఎలక్షన్ విధి విధానాలపై స్పష్టత రావాల్సి ఉందన్నారు సజ్జల. ఈ ఆలోచన మంచిదే అని.. కానీ దీనిని అమలు పై చాలా ప్రశ్నలు ఉన్నాయని పేర్కొన్నారు.
చర్చలు, సంప్రదింపులు చాలా కీలకం అన్నారు. జమిలీ ఎన్నికలు జిందా తిలస్మత్ కాదు.. దేశంలో చాలా సమస్యలున్నాయి. అర్జెంట్ గా వాటిపై చర్చించాల్సిన స్థాయి అంశం కాదు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మరోవైపు వన్ నేషన్-వన్ ఎలక్షన్ అనేది అమెరికాలో సాధ్యమైంది. కానీ భారత్ లో సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎందుకు అంటే అమెరికాలో కేవలం రెండు పార్టీలు మాత్రమే ఉన్నాయని.. భారత్ లో పరిస్థితి చాలా భిన్నంగా ఉందని.. ఇక్కడ వన్ నేషన్- వన్ ఎలక్షన్ విధానం సాధ్యపడదు అని స్పష్టం చేశారు.