స్థిరాస్తి అమ్మకం, తాకట్టు పై మద్రాస్ హై కోర్టు సంచలన తీర్పు..!

-

సాధారణంగా ఎవరి పేరు మీద అయిన ఆస్తి ఉంటే.. వారు దానిని తమ అవసరాలకు అనుగుణంగా తాకట్టు పెట్టుకునేందుకు మాత్రమే వీలుంటుంది. ఒకవేళ ఆస్తి ఇతరుల పేరు మీద ఉండి తాకట్టు పెడతానంటే అది సాధ్యం కాని పని. ఈ నేపథ్యంలోనే తాజాగా మద్రాస్ హైకోర్టు ఆస్తి తాకట్టు, అమ్మకం విషయంలో సంచలన తీర్పును వెల్లడించింది.

కోమాలో ఉన్న వ్యక్తికి చెందిన దాదాపు రూ.1 కోటి విలువైన స్థిరాస్తిని విక్రయించేందుకు, తాకట్టు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అతడి భార్య హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఆమె భాధలను సావధానంగా విన్న ధర్మాసనం స్థిరాస్తిని అమ్మేందుకు, తాకట్టు పెట్టేందుకు అనుమతించింది. అయితే, కోర్టు ఇక్కడే ఓ కండీషన్ పెట్టింది. స్థిరాస్తి అమ్మగా వచ్చిన నగదును తన భర్త, పిల్లలు లేదా కుటుంబ పోషణకు మాత్రమే వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version