నవంబరు 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు

-

నవంబరు 29 నుంచి డిసెంబర్‌ 23 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 20 పనిదినాలు (సిట్టింగ్‌లు) ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో ఉండనున్నట్లు సమాచారం. ఈ మేరకు నేడు (సోమవారం) కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని “పార్లమెంటరీ వ్యవహారాల పై ఏర్పాటైన మంత్రివర్గ సంఘం (సిసిపిఎ) సిఫార్సు లు చేసింది. గత సమావేశాల మాదిరిగానే“కరోనా” నియమ నిబంధనలకు అనుగుణంగానే  జరుగనున్నాయి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.

పార్లమెంట్

“కరోనా” కారణంగా గతేడాది జరగని శీతాకాల సమావేశాలు… గతంలో కరోనా కారణంగా ఉదయం రాజ్యసభ నిర్వహించగా.. మధ్యాహ్నాం లోక్‌సభ నిర్వహించారు. అయితే, ఈసారి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఏకకాలంలో ( రెగ్యులర్) జరగనున్నాయి ఉభయ సభల కార్యక్రమాలు.

సభ్యులు పాటించాల్సిన భౌతిక దూరం నిబంధనలు యధాతధంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది మంత్రివర్గ సంఘం (సిసిపిఎ). ఎంపిలతో సహా, పార్లమెంటు భవన్ ప్రాంగణంలో ప్రవేశించే వారంతా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని… శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే ముందు “కోవిడ్-19” పరీక్ష తప్పనిసరని పేర్కొంది. ఇక ఇప్పటికే పార్లమెంట్‌ సభ్యులు, ఉద్యోగులు దాదాపు 90 శాతం రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నారు. రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌తో సహా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఈ శీతాకాల సమావేశాలకు ప్రాధాన్యత నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version