ENGLAND : ఇంగ్లాండ్ జట్టులో ఏడుగురికి కరోనా.. కొత్త కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్

-

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి.. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ సోకుతోంది. ఇప్పటికే ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులకు కరోనా సోకింది. తాజాగా ఈ కరోనా మహమ్మారి సెగ ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టుకు తగిలింది. శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన ఇంగ్లాండ్‌ జట్టు.. ప్రస్తుతం పాక్‌ తో వన్డే, టీ20 సిరీస్‌ కోసం సన్నద్ధమవుతోంది.

జూలై 8 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్‌ జట్టులో కరోనా కలకలం రేపింది. ఆ జట్టులోని ముగ్గురు క్రికెటర్లకు కరోనా సోకింది. ముగ్గురు క్రికెటర్లతో పాటు నలుగురు సహాయక సిబ్బందికి ఈ మహమ్మారి సోకింది. దీంతో ఇంగ్లాండ్‌ జట్టులో కలకలం రేగింది. దీంతో పాక్‌ తో సిరీస్‌కు ఎంపికైన జట్టును కాకుండా పూర్తిగా కొత్త జట్టును ఎంపిక చేసిన ఇంగ్లాండ్‌ బోర్డు.. కెప్టెన్‌ గా బెన్‌ స్టోక్స్‌ ను నియమించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version