గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి చెందిన సంఘటన పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాల జిల్లా పథార్ ప్రతిమా గ్రామంలో జరిగింది.

పేలుడు సంభవించిన ఇంటిని బాణసంచా తయారీ కేంద్రంగా ఉపయోగించడంతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని… దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి చెందిన సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి..
మృతుల్లో ముగ్గురు చిన్నారులు.
పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాల జిల్లా పథార్ ప్రతిమా గ్రామంలో ఘటన.
పేలుడు సంభవించిన ఇంటిని బాణసంచా తయారీ కేంద్రంగా ఉపయోగించడంతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్న పోలీసులు. pic.twitter.com/kdfI5aRhfG— ChotaNews App (@ChotaNewsApp) April 1, 2025