తమిళనాడులో దారుణం… బాలుడిపై ముగ్గురు హైస్కూల్ విద్యార్థుల లైంగిక దాడి

-

సమాజంలో రోజురోజుకు విలువలు దిగజారిపోతున్నాయి. కామాంధులు వావీ వరస, చిన్నా పెద్ద, ఆడ మగ అన్న తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ జాడ్యం ఎక్కడి దాకా వెళ్లిందంటే… మైనర్లు కూడా లైంగిక దాడులకు తెగబడుతున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే తమిళనాడులో జరిగింది. తొమ్మిదేళ్ల మైనర్ బాలుడిపై ముగ్గురు హైస్కూల్ స్టూడెంట్లు లైంగిక వేధింపులక పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడు, ట్యూటికోరిన్ ప్రాంతంలో జరిగింది. దాదాపు నెలన్నర కాలం నుంచి బాలుడిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. నిందితుల్లో ఇద్దరు 8వ తరగతి చదువుతుండగా.. ఒకరు 9 తరగతి విద్యార్థి. తరుచూ పోర్న్ చూపిస్తూ.. బాలుడిపై లైంగికదాడికి తెగబడుతున్నారు. బాధిత బాలుడు నిందితులకు పొరుగునే ఉండే ఆటో డ్రైవర్ కుమారుడు. ఆన్ లైన్ క్లాసుల కారణంగా విద్యార్థులకు సెల్ ఫోన్లు ఉండటంతో.. తరుచూ పోర్న్ చూపిస్తూ అందులో ఉండేలా చేయాలని బాధిత బాలుడిని లైంగికంగా వేధించేవారు.

ఈ అమానవీయ ఘటనలో బాధిత బాలుడు కొన్ని రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. బయటకి వస్తే ఎక్కడ తను హింసిస్తారో అని భయపడి ఇంటికే పరిమితం అయ్యాడు. అయితే ఇటీవల ఆకలి కోల్పోవడం, అనారోగ్యం కారణంగా బాలుడిని తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్చారు. దాదాపు 10 రోజుల తరువాత కౌన్సిలింగ్ అనంతరం తనపై జరిగిన లైంగిక దాడి గురించి తల్లిదండ్రులకు వివరించారు.

బాలుడు తీవ్రగాయాలకు గురయ్యాడని, షాక్ నుంచి బయటకు రాలేకపోయాడని వైద్యులు తెలిపారు. కౌన్సెలింగ్ అనంతరం జరిగిన మొత్తం విషయాన్ని తన తల్లికి వివరించాడు. తల్లిదండ్రులు కోవిల్‌పట్టి ఈస్ట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version