టెస్కో వీసీ మరియు ఎండీగా శైలజ రామయ్యర్ బాధ్యతలు

-

రాష్ట్ర చేనేత జౌళిశాఖ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం చేనేత, జౌళి శాఖ సంచాలకులుగా, టెస్కో వీసీ మరియు ఎండీగా శైలజ రామయ్యర్ బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా చేనేత, పవర్లూమ్ సహకార సంఘాల ప్రతినిధులు, సభ్యులు, చేనేత కళాకారులు, చేనేత జౌళి శాఖ ఉద్యోగులు, టెస్కో ఉద్యోగులు శైలజ రామయ్యర్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ చేనేత, జౌళి శాఖ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కేటీ చారి మాట్లాడుతూ.. చేనేత రంగంలో శైలజరామయ్యార్‌కు అపార అనుభవం కలిగి చేనేత కార్మికులు, చేనేత రంగంపై పూర్తి అవగాహన ఉందని అన్నారు. సమస్యలను పరిష్కరించి చేనేత రంగాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులు సమస్యలు పరిష్కారం అవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ విజయ్ కుమార్, గౌరవాధ్యక్షుడు రవీంద్ర, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version