గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో వసతి గృహాల నిర్మాణం, రోడ్ల మరమ్మత్తులు, కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్లు పునరుద్ధరించాలని జూనియర్ డాక్టర్లు సమ్మె చేపట్టారు. వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో మూడు పాత మెడికల్ కాలేజీలకు రూ.204.85 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ బుధవారం ఉత్తర్వులిచ్చారు.ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలలో హాస్టల్స్, రోడ్లు, ఇతర ఇన్ ఫ్రా స్ట్రక్చర్‌లను సమకూర్చుకునేందుకు ఈ నిధులు వినియోగించుకోవాలని ఆమె సూచించారు.
ఉస్మానియా మెడికల్ కాలేజీ లేడీస్ హాస్టల్‌కు రూ.80 కోట్లు, మెన్స్ హాస్టల్‌కు రూ.35 కోట్లు, డెంటల్ హాస్టల్‌కు రూ.6 కోట్లు, ప్రస్తుత పాత హాస్టల్ రిపేర్, రెనోవేషన్‌కు రూ.50 లక్షలు, క్రిష్ణవేణి లేడీస్ హాస్టల్ సీసీ రోడ్లకు రూ.40 లక్షలు కేటాయించారు. ఇక గాంధీ మెడికల్ కాలేజీ లేడీస్ హాస్టల్‌కు రూ.42 కోట్లు, మెన్స్ హాస్టల్‌కు రూ.23 కోట్లు, సీనియర్ రెసిడెంట్స్ హాస్టల్ బ్లాక్ నిర్మాణానికి రూ.14.50 కోట్లు కేటాయించారు.అలాగే కాకతీయ మెడికల్ కాలేజీ ఇంటర్నల్ సిమెంట్ కాంక్రీట్ రోడ్లకు రూ.2.75 కోట్లు, జీఎస్టీ, ఇతరాత్ర ఖర్చులు రూ.70 లక్షలు చొప్పున కేటాయించారు.