సమంత ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. శాకుంతలం రిలీజ్ డేట్ ఫిక్స్

-

సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ తెరకెక్కించిన సినిమా ‘శాకుంతలం’. ఈ మూవీకి సంబంధించి చిత్రబృందం ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సమంత తన సోషల్​ మీడియా వేదికగా పోస్టు చేసింది. దీంతో పాటు ఈ సినిమాను త్రీడీలో కూడా విడుదల చేయనున్నట్లు చెప్పింది.

ఈ చిత్రానికి నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవ్‌ మోహన్‌, మోహన్‌బాబు, మధుబాల, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దీన్ని రూపొందించారు. శకుంతల, దుష్యంత మహారాజుల మధ్య ఉన్న అజరామరమైన ప్రణయ గాథ నేపథ్యంలో సినిమా సాగుతుంది.

ఇందులో శకుంతల పాత్రను సమంత పోషించగా.. దుష్యంత మహారాజు పాత్రలో దేవ్‌ మోహన్‌ నటించారు. దీన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు నీలిమ గుణ. దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. సాయిమాధవ్‌ బుర్రా మాటలు రాశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version