అనిల్ కుంబ్లేను అధిగమించిన మహ్మద్ షమీ

-

వరల్డ్ కప్ 2023లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో అవకాశం లభించలేదు. కానీ హార్థిక్ పాండ్యా న్యూజిలాండ్ మ్యాచ్తో దూరం కావడంతో జట్టులోకి రెండు మార్పులు జరిగాయి. దీంతో ఇద్దరు ఆటగాళ్లకు ఛాన్స్ దొరికింది. అందులో ఒకరు సూర్యకుమార్ యాదవ్, మరొకరు మహమ్మద్ షమీ ఉన్నారు. అయితే ముందుగా బౌలింగ్ ఎంచుకున్న భారత్ బౌలర్లలో మొదట సిరాజ్ ఒక వికెట్ తీయగా.. రెండో వికెట్ షమీ సాధించాడు.

వరల్డ్ కప్ లలో టీమిండియా తరఫున అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో మహ్మద్ షమీ మూడో స్థానంలో నిలిచాడు. ఇవాళ న్యూజిలాండ్ తో ధర్మశాలలో జరుగుతున్న పోరులో షమీ… ఓపెనర్ విల్ యంగ్ ను అవుట్ చేశాడు. తద్వారా షమీ వరల్డ్ కప్ లలో సాధించిన వికెట్ల సంఖ్య 32కి పెరిగింది. టీమిండియా లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 31 వికెట్ల ఫీట్ ను షమీ అధిగమించాడు.
ప్రపంచకప్‌లలో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు జాబితా..

జహీర్ ఖాన్ – 44
జవగల్ శ్రీనాథ్ – 44
మహ్మద్ షమీ – 32*
అనిల్ కుంబ్లే – 31
జ‌స్‌ప్రీత్ బుమ్రా – 28*

ఈ జాబితాలో పేస్ దిగ్గజం జవగళ్ శ్రీనాథ్, లెఫ్టార్మ్ సీమర్ జహీర్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారు. వీరు ఇరువురు వరల్డ్ కప్ లలో 44 వికెట్లు తీయడం విశేషం. ఇప్పుడు వీరిద్దరి తర్వాత స్థానంలో షమీ నిలిచాడు. మరో పేసర్ జస్ప్రీత్ బుమ్రా వరల్డ్ కప్ లలో 28 వికెట్లు తీసి కుంబ్లే తర్వాత స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ధర్మశాలలో న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో భారత్ వరుస విజయాలపై కన్నేసింది. ఈ మ్యాచ్లో కివీస్ జట్టుపై టీమిండియా గెలుపొందితే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో ఉండనుంది. మరోవైపు న్యూజిలాండ్పై భారత్ గెలిచిన సందర్భాలు ఎక్కువగా లేవు. చూడాలి మరీ న్యూజిలాండ్పై భారత్ గెలుస్తుందా లేదా అనేది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version