పూరీ – లావణ్య ల విడాకుల విషయంపై క్లారిటీ ఇచ్చిన శంకరన్న..!!

-

తెలుగు చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ యాక్షన్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇకపోతే ఇటీవల ఈయన ప్రముఖ హీరోయిన్ ఛార్మీ కౌర్ తో సహజీవనం చేస్తున్నాడని , ఇక తన భార్య లావణ్యకు విడాకులు ఇవ్వబోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అవుతున్నాయి. అంతేకాదు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశపూరి ఇటీవల నటించిన చోర్ బజార్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా పూరి జగన్నాథ్ రాకపోవడంతో బండ్ల గణేష్ ఈయనపై చెలరేగిపోయి ప్రకంపనలు సృష్టించాడు. ఇక బండ్ల గణేష్.. పూరి జగన్నాథ్ ను ఉద్దేశించి నా కొడుకు సినిమా రిలీజ్ ఈవెంట్ అయితే నేను లండన్ లో ఉన్నా సరే ఫ్లైట్ ఏసుకొని వచ్చేస్తాను.. నువ్వు ముంబై వీధుల్లో ఎవరితో కులుకుతున్నావో మాకు తెలుసు. బంగారు తల్లి దేవత లాంటి లావణ్యకు అన్యాయం చేయొద్దు అంటూ బండ్ల గణేష్ పూరీ జగన్నాథ్ పై రకరకాల కామెంట్లు చేశాడు.

ఇకపోతే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని పూరి జగన్నాథ్ కూడా తనదైన శైలిలో బండ్ల గణేష్ పై మాటల బాణాలు విసిరాడు. కానీ ఎవరేమనుకున్నా సరే పూరి జగన్నాథ్ లావణ్య కు అన్యాయం చేస్తున్నాడని వార్తలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇకపోతే ఆ తర్వాత ఎవరు కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. కానీ ఇటీవల లావణ్య , పూరి జగన్నాథ్ దంపతులకు దగ్గరుండి వివాహం జరిపించిన శంకరన్న క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ శంకర్ అన్న ఎవరో కాదు ముఖానికి మేకప్ వేసుకోని ఒక గొప్ప సెలబ్రిటీ అని చెప్పవచ్చు. జనతా గ్యారేజ్ లో సమస్యలు వస్తే ఎలా అయితే మోహన్ లాల్ దగ్గరికి వెళ్తారో.. రియల్ లైఫ్ లో కూడా శంకరన్న దగ్గరికి చాలామంది అలాగే వెళ్తారు. అడిగిన వారికి కాదనకుండా సహాయం చేయగలిగే గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి శంకరన్న.

లావణ్య కు దగ్గర బంధువు కూడా.. అందుకే వీరి ప్రేమ గురించి తెలుసుకున్న శంకరన్న దగ్గరుండి మరి వివాహం జరిపించాడు . ఇప్పటికీ కూడా లావణ్య ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది. ఇక పూరి జగన్నాథ్ కూడా అప్పుడప్పుడు శంకరన్నతో ఫోన్లో మాట్లాడుతుంటారని సమాచారం. ఇక వీరిద్దరి మధ్య వస్తున్న విడాకుల వార్తలపై శంకరన్న స్పందిస్తూ.. అప్పుడప్పుడు వారితో నేను కలుస్తూ ఉంటాను. వారి మధ్య ఏ గొడవలు లేవు కేవలం ఇవన్నీ పుకార్లు మాత్రమే. వారిద్దరూ చిరకాలం సంతోషంగా ఉంటారు అంటూ క్లారిటీ ఇచ్చారు శంకరన్న.

Read more RELATED
Recommended to you

Exit mobile version