దీన్ని శివసేన ఎంపీ, ఎమ్మెల్యే సీరియస్‌గా తీసుకుని కంగన ముంబైలో అడుగుపెడితే రాళ్లతో కొట్టి చంపేస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చిరంచారు. దీనిపై జాతీయ మహిళా కమీషన్ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసి కంనకు మద్దతుగా నిలిచింది. ఈ బుధవారం కంగన ముంబైలో అడుగుపెడుతున్న వేళ ఆమె ఆఫీస్, ఇంటి ఆవరణలో 14 అక్రమ కట్టడాలున్నాయని ముంబై మున్సిపల్ సిబ్బంది కూల్చివేతలకు దిగడం తీవ్ర రాజకీయ దుమారానికి ఆజ్యం పోసింది.
విషయం తెలుసుకున్న శివసేన మిత్రపక్ష్యం నేత శరత్‌పవార్ శివసేన తీరుని ఎండగట్టారు. కంగన ఆఫీసు కూల్చయివేత వ్యవహారం మహా సర్కారు, సీఎం ఉద్ధావ్ ఠాక్రే ప్రతిష్టను మసక బరిచిందని మండి పడ్డారు. కంగన విషయంలో ముంబై మున్సిపల్ తీరును తాను సమర్థించబోనని, ఈ టైమ్‌లో కంగన ఇంటిని నిర్మాణాలని కూల్చడం హర్షించదగ్గ విషయం కాదని శివసేనకు అక్షింతలేశారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, ముంబైలో అక్రమ నిర్మాణాలు అన్నది కొత్త కాదని, ఈ సమయంలో ముంబై మున్సిపల్ శాఖ కంగన ఇల్లు, ఆఫీసుల్ని కూల్చే ప్రయత్నం చేయడం తప్పుడు సంకేతాలకు తావిస్తోందని మందలించే ప్రయత్నం చేశారు. ఈ ఎపిసోడ్ ఇలాగే కొనసాగితే కంగన కారణంగా ఎన్‌సీపీ తమ మద్దతును ఉపసంహరించుకునే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.