తెలంగాణలో అనూహ్యంగా రాజకీయ పార్టీని పెడతానని ప్రకటించి సంచలనంగా మారిన వైఎస్ షర్మిల Sharmila ఆది నుంచి విమర్శల పాలవుతూనే ఉంది. ఏ పార్టీ అయినా మనుగడ సాధించాలంటే అందులో ఉండే నేతలు ఖచ్చితంగా పది మందికి చెప్పే స్థాయలోనే వ్యవహరించాలి. కానీ వారే నిబంధనుల దాటినట్టు ప్రజల దృష్టిలో పడితే మాత్రం చులకనవడం ఖాయమనే చెప్పాలి.
ఇది వరకే షర్మిలపై ఛాన్స్ దొరికితే ఆడేసుకుంటున్న నెటిజన్లు.. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు. మరి అలాంటి టైమ్లో షర్మిల మరింత జాగ్రత్తగా ఉండాల్సింది పోయి పదే పదే విమర్శల పాలయ్యే పనులే చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి పనేచేసి విమర్శల పాలవుతున్నారు.
బుధవారం లోటస్ పాండ్లోని తన నివాసంలో టీమ్ వైఎస్సార్ వెబ్సైట్ ప్రారంభోత్సవంలో షర్మిల పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆమె మాస్కు లేకుండానే ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. అక్కడితో ఆగకుండా ప్రతి ఒక్కరితో సోషల్ డిస్టెన్స్ కూడా లేకుండా చర్చలు జరపుతూ వ్యవహరించడం చేశారు. మొదటి
నుంచి ఆమె కరోనాపై జాగ్రత్తలు చెబుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమెనే ఇలా నిబంధలను మరవడంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.