తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు కోసం కసరత్తు చేస్తున్న వైఎస్ షర్మిల.. ఇప్పటికే పలు జిల్లాల వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో వైఎస్ హయాంలో పనిచేసిన కీలక రిటైర్డ్ అధికారులు కూడా ఆమెను కలుస్తున్నారు. తాజాగా వైఎస్ షర్మిల మరో కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. పార్టీ ఏర్పాటుపై లోటస్ పాండ్ లో ముఖ్య అనుచరులతో వైయస్ షర్మిల సమావేశం అయ్యారు.
పెట్టబోయే పార్టీకి ముందుగానే గ్రామ, మండల స్థాయి, కమిటీల నియామకం పై కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. మండలానికి ముగ్గురు సభ్యులు చొప్పున కమిటీలు ఏర్పాటు చేసే అవాకాశం కనిపిస్తోంది. ఈ నెల 16 లోపు కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆ భాద్యతలు ముఖ్య అనుచరుడు పిట్టా రామ్ రెడ్డికి అప్పగించినట్టు చెబుతున్నారు. షర్మిల పార్టీ ఏర్పాటుకు ముందు నుంచి అండగా ఉన్న వైఎస్సార్ అభిమానులకి ఈ కమిటీలలో పెద్ద పీట వేయనున్నట్టు చెబుతున్నారు.