మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా? అయితే మీకు రావాల్సిన డబ్బులు ఎప్పుడు వస్తాయో ఇలా తెలుసుకోవచ్చు. అలానే ఎల్ఐసీ పాలసీ ప్రీమియం ఎప్పుడు చెల్లించాలి వంటివి కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఎల్ఐసీ ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం ఇంట్లో నుండే మీరు తెలుసుకోవచ్చు. ఎల్ఐసీ ఇ-సర్వీస్ పోర్టల్‌లో రిజిస్టర్ అవసరం. కాబట్టి ఇలా చేసాక ఈ సమాచారాన్ని పొందొచ్చు. లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఈ వివరాలన్నీ తెలుసుకోవచ్చు.
ఇప్పుడు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఇది పూర్తయ్యాక మీరు https://ebiz.licindia.in/ వెబ్‌సైట్‌లో Customer Portal పైన క్లిక్ చేసి లాగిన్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పోర్టల్ లో వేర్వేరు సేవలు లభిస్తాయి.
పాలసీ షెడ్యూల్, పాలసీ స్టేటస్, బోనస్ స్టేటస్, లోన్ స్టేటస్, క్లెయిమ్ స్టేటస్, రివైవల్ కొటేషన్, ప్రీమియం డ్యూ క్యాలెండర్ ఇలా వీటికి సంబంధించి మొత్తం మీరు చూడవచ్చు. దీనితో మీకు LIC ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదు. కేవలం ఇంట్లో వుండే ఈ సమాచారాన్ని అంత పొందవచ్చు.