కేసీఆర్, టిఆర్ఎస్ గుండాల నుంచి నాకు ప్రాణహాని ఉంది – వైఎస్ షర్మిల

-

తెలంగాణ సీఎం కేసీఆర్, టిఆర్ఎస్ గుండాల నుంచి నాకు ప్రాణహాని ఉందని వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు వైఎస్సార్ లెగసీ చూసి భయం పడుతుంది.. వైఎస్ షర్మిల పాదయాత్ర… కేసీఆర్ పాలనకు అంతిమ యాత్ర అన్నారు. పోలీసుల భుజం పై గన్ను పెట్టి… మా పాదయాత్ర అపుతున్నారని ఆగ్రహించారు.

హై కోర్టు ఆదేశాలు ఉన్నా.. పాదయాత్ర అనుమతి ఇవ్వకుండా షోకాజ్ నోటీసులు ఇచ్చారని.. టీఎస్ పోలీసు డిపార్ట్మెంట్… టిఆర్ఎస్ పోలీస్ గా మారిందని ఆగ్రహించారు. బస్సు తగిలబెట్టింది టిఆర్ఎస్ కార్యకర్తలు.. ఫ్లెక్సీలకు నిప్పు పెట్టింది టిఆర్ఎస్ కార్యకర్తలు అని.. శాంతిభద్రతలకు విఘాతం కల్గించింది టిఆర్ఎస్..అని నిప్పులు చెరిగారు.

నాపై వ్యక్తి గత దూషణలు చేసింది టిఆర్ఎస్… తిరిగి నాపైనే కేసులు పెట్టారు.. ఎమ్మెల్యేల అవినీతిని ఎండగట్టడం తప్పా ? అని ప్రశ్నించారు. నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీల నేతలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు పార్ట్నర్ గా చేసుకోవడంతో అవినీతి ఇన్నాళ్లు బయటకు రాలేదని.. ప్రభుత్వ వైఫల్యాలను ఎ0డగడుతుంటే… నాకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version