తెలంగాణలో జెండా పాతాలనే లక్ష్యంతో కొత్త పార్టీని పెట్టిన షర్మిల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అసలు ఆమె పార్టీలోకి ఎవరైనా రావడం మాట పక్కన పెడితే అసలు ఉండే వారుఎవరైనా ఉంటారా అని అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఆమె పార్టీలో ఉండే చాలామంది రాజీనామాల పర్వం పడుతున్నారు. అసలు షర్మిల తప్ప ఆమె పార్టీలో చెప్పుకోదగ్గ లీడర్ లేకపోవడం పెద్ద సమస్యగా మారితే అసలు అంతో ఇంతో ఉన్న కేడర్ కూడా పెద్దగా కలిసి రావట్లేదనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రణాళిక వేసింది ఆమె.
అయితే అసలు గ్రౌండ్ లెవల్లో కార్యకర్తలు లేని పార్టీని పీకే ఎలా పైకి తెస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ప్రశాంత్ టీమ్ నుంచి మాత్రం ఇప్పటికే చెన్నై నివాసి అయిన ప్రియా రాజేంద్రన్ మాత్రం ఆమె పార్టీ పెట్టినప్పటి నుంచే పెద్ద ఎత్తున ప్లాన్లు వేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అంతంత మాత్రమే పనిచేసిన ప్రియ సెప్టెంబర్ నుండి పూర్తిగా రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పీకే షర్మిలతో భేటీ అయి తమ టీమ్ పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తుందని భరోసా ఇఛ్చినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏ మేరకు ఆయన సక్సెస్ అవుతారో.