రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో ప్రజలు వణుకుతున్నారు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో 12.2 లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.దీంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తాండూరులో కాగ్నా నది, చెరువులు వాగులు ఉన్న ప్రాంతాల్లోని వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి.చలి తీవ్రత పెరగడం, వ్యాధులు సైతం విజృంభిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ఉదయం లేవాలంటేనే జంకుతున్నారు.ఇక హైదరాబాద్‌లోనూ చలి తీవ్రత పెరిగింది.దీంతో తెల్లవారుజామున పొగమంచు కమ్ముకుంటోంది.వికారాబాద్ జిల్లాలో వరుసగా రెండు రోజులు 12.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.