కాంగ్రెస్ సీనియర్ నేత శశి ధరూర్ ఆ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే ఈ విషయంపై థరూర్ నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మలయాళ దినపత్రిక ” మాతృభూమి”లో ఆయన ఇటీవలే ఓ ఆర్టికల్ రాశారు. అందులో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక గురించి ప్రస్తావించారు. పూర్తి పారదర్శకంగా కాంగ్రెస్ అధ్యక్షు
ఎన్నిక జరగాలని ఆయన చెప్పారు. కానీ ఆయన బరిలో నిలిచే విషయం స్పష్టం చేయలేదు.
పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయడం కోసం సోనియా గాంధీకి లేఖ రాసిన జీ 23 నేతల్లో శశి థరూర్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడం పార్టీ పునర్జీవానికి నాంది అని శశి థరూర్ అభిప్రాయపడ్డారు. ఇక వచ్చే నెల 22న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ వెలువలనుంది. అక్టోబర్ 19న అధ్యక్షుడిని ప్రకటిస్తారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న స్థితి, సంక్షోభం నేపథ్యంలో ఎవరు పార్టీ పగ్గాలు చేపట్టినా నిస్సందేహంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను ఉత్తేజపరచడంతో పాటు ఓటర్లను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉందని ” మాతృభూమి” ఆర్టికల్ లో శశి థరూర్ చెప్పారు.