No 1 హీరోయిన్ ఆమె..షాక్ లో బాలీవుడ్ హీరోయిన్స్..!

-

తాజాగా సర్వే నిర్వహించగా భారత దేశంలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా టాలీవుడ్ హీరోయిన్ సమంత గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఒకానొక సమయంలో తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన సమంత తమిళ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక తెలుగులో ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఆ తర్వాత తన నటనతో అమాయకపు చూపులతో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న ఈ ముడ్డుగున్న ఎంతోమంది స్టార్ హీరోలకు గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ఈమె నటించిన అన్ని సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా హీరోలకు కూడా మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి.

ఇకపోతే ఈ ముద్దుగుమ్మ నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాలు చేత విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక విడాకుల తర్వాత పూర్తిగా తన కెరియర్ పైన దృష్టి పెట్టిన సమంత.. ఎక్కువగా బాలీవుడ్ వైపే తన ఫోకస్ మొత్తం పెట్టేసింది. ఈ క్రమంలోనే పాన్ ఇండియన్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక అందులో భాగంగానే ఇండియన్ ఫీమేల్ స్టార్ హీరోయిన్ల అందరిలో కూడా నంబర్ వన్ స్టార్ హీరోయిన్గా సమంత తాజాగా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం..

ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియన్ సినిమాలలో, వెబ్ సిరీస్ లో అదరగొడుతూ బాలీవుడ్ రేంజ్ వరకు చేరుకున్న సమంత ఇప్పుడు అక్కడ కూడా ఫుల్ బిజీ అయిపోయింది. తాజాగా పాన్ ఇండియన్ లేడీస్ మీద చేసిన సర్వేలో సమంత నెంబర్ వన్ హీరోయిన్గా నిలిచారు. ఆ తర్వాత స్థానంలో కరీనా, కత్రినా, ఆలియా , దీపిక లాంటి నార్త్ హీరోయిన్లను వెనక్కు నెట్టి.. రష్మిక మందన్న, కీర్తి సురేష్, నయనతార, పూజా హెగ్డే లాంటి సౌత్ హీరోయిన్లను కూడా దాటేసి నంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకున్నారు సమంత. ఈ విషయంపై ఆమె అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version