డాన్స్ మాస్టర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన శేఖర్ మాస్టర్.. ప్రస్తుతం కొరియోగ్రాఫర్ గా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలకు కూడా పనిచేశారు. అంతేకాదు ఈయన కొరియోగ్రఫీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి , అల్లు అర్జున్ లాంటి గొప్ప డాన్సర్లు కూడా శేఖర్ మాస్టర్ డాన్స్ ను తెగ పొగుడుతూ ఉంటారు . ఇక ఒకప్పుడు రాకేష్ మాస్టర్ శిష్యుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈయన ఆ తర్వాత తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ మంచి పేరును సంపాదించారు. అంతేకాదు అనేక మంది స్టార్ హీరోలకి కొరియోగ్రఫీ చేస్తున్న సమయంలోనే బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఒకవైపు సినిమాలలో కొరియోగ్రఫీ గా పని చేస్తూనే మరొకపక్క బుల్లితెరపై ప్రసారమయ్యే కొన్నిషోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు.
ఇకపోతే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంటే.. ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోంది ..శేఖర్ మాస్టర్ కుమార్తె గాని ఈమె పరిచయమైనప్పటికీ తన డాన్స్ తో.. టిక్ టాక్ వీడియోలతో మంచి పేరు సంపాదించుకుంది. ఇక చూడడానికి కుందనపు బొమ్మలా ఉండే ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం కోసం రంగం సిద్ధమైందని తెలుస్తోంది ఇప్పటికే ఒక కొత్త దర్శకుడు ఆమెకు కథ చెప్పారు అని శేఖర్ మాస్టర్ కూడా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని సమాచారం.
డైరెక్టర్ కొత్త వాడైనా క్రేజ్ ఉన్న యంగ్ హీరోను సినిమాలో భాగం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ తన పరిచయాలను ఉపయోగించి మీడియం హీరోలకు దర్శకుడి చేత కథ చెప్పిస్తున్నారని ప్రచారం కూడా జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న శేఖర్ మాస్టర్ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక సాహితీ తమ్ముడు విన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇక సాహితీ ఇండస్ట్రీలోకి వస్తే మన తెలుగు అమ్మాయి హీరోయిన్ గా వస్తోంది అంటూ ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.