శిల్పశెట్టి భర్త రాజ్‌కుంద్రా పోర్న్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే…రాజ్‌కుంద్రా పోర్న్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు అదుపులో ఉన్న రాజుకుంద్రాకు రోజు రోజుకు ఉచ్చు బిగిస్తూనే ఉంది. అయితే తాజాగా రాజ్ కుంద్రా వ్యవహారంపై అతని భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఎట్టకేలకు పెదవి విప్పింది. గత కొన్ని రోజులుగా ఎన్నో ఆరోపణలు మరియు వదంతులు వ్యాప్తి చేస్తున్నారని అలాగే ట్రోలింగ్ తో పాటు ప్రశ్నలు సంధిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు శిల్పాశెట్టి. ఈ వివాదంలోకి తనను లాగుతూ తప్పుడు ప్రచారం చేయొద్దని తన సోషల్ మీడియా వేదికగా శిల్పాశెట్టి కోరారు. పోర్న్ రాకెట్ కేసు విచారణలో ఉందని, ముంబై పోలీసులతో పాటు న్యాయవ్యవస్థ పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా తాను దేశ చట్టాలను గౌరవిస్తూ కష్టించి పనిచేసే ప్రొఫెషనల్ గా ఉన్నానని తెలిపారు. మీడియా విచారణను తాను కోరుకోవడం లేదని పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకునేలా మనం వ్యవహరించాలని సత్యమేవ జయతే అంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు.