సూర్యాపేట వాసులకు గుడ్​న్యూస్.. త్వరలోనే శిల్పారామం ఏర్పాటు

-

సూర్యాపేట వాసులకు శుభవార్త. ఇప్పటికే హైదరాబాద్ వాసులను అలరిస్తున్న పర్యాటక ప్రదేశం శిల్పారామాన్ని సూర్యాపేటలోనూ ఏర్పాటు చేయనున్నారు. పట్టణంలోని సద్దుల చెరువు మినీ ట్యాంక్‌బండ్‌ సమీపంలో జాతీయ రహదారి పక్కన శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌ ప్రసాదించిన సూర్యాపేట జిల్లాను సరికొత్త అందాలతో తీర్చిదిద్దుకుందామని అన్నారు.

శిల్పారామం ఏర్పాటు చేయనున్న ప్రాంగణాన్ని సంబంధిత అధికారులు, హైదరాబాద్‌ శిల్పారామం నిర్వాహకులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఉమ్మడి పాలనలో సిండికేట్‌ దందాలు, అక్రమాలు, రౌడీ రాజకీయాలతో ఏ మాత్రం అభివృద్ధికి నోచని సూర్యాపేటను కేవలం ఎనిమిదేళ్లలోనే ఎంతో అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. కోట్ల రూపాయలతో వినూత్న రీతిలో సూర్యాపేట రూపురేఖలు మార్చుకుని ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి పాలన కొనసాగించుకుంటున్నామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version