BREAKING : అంబేడ్కర్ జయంతి రోజు నూతన సచివాలయం ప్రారంభం?

-

ఫిబ్రవరి 17వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు నాడు తెలంగాణ సచివాలయాన్ని ప్రారంభించాల్సి ఉండగా అది వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది.

అయితే అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14వ తేదీన కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందున అదే మంచి రోజు అని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జాతీయ నేతల తో పాటు… తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం తదితరులు రానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version