షాకింగ్: మాకు వ్యాక్సిన్ వద్దంటున్న 60 శాతం మంది ఇండియన్స్

-

కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనుకాడే భారతీయ పౌరుల శాతం 3 వారాల్లో 69 శాతం నుంచి 60 శాతానికి పడిపోయిందని లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో తాజాగా వెల్లడైంది. తాజాగా నిర్వహించిన పరిశోధనల ప్రకారం, ఇప్పుడు 60 శాతం మంది పౌరులు కోవిడ్ -19 వ్యాక్సిన్‌ ను తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. అక్టోబర్ 2020 లో, లోకల్ సర్కిల్స్ సర్వేలో 61 శాతం పౌరులు టీకా షాట్ పొందడానికి వెనుకాడారని వెల్లడి అయింది.

నవంబర్ సర్వేలో ఈ శాతం 59 శాతానికి తగ్గింది. ఆ తరువాత, వ్యాక్సిన్ల యొక్క దుష్ప్రభావాలు మరియు సమర్థతపై అనిశ్చితి, దాని విచారణ సమయంలో ప్రతికూల సంఘటనల నివేదికలు అనేక మందిని కంగారు పెట్టాయి. దీని ఫలితంగా డిసెంబరులో నిర్వహించిన సర్వేలో శాతం 69 శాతం మంది వ్యాక్సిన్ వద్దన్నారు. జనవరి మొదటి వారంలో కూడా అదే విషయం స్పష్టం చేసారు.

అయితే వ్యాక్సిన్ విషయంలో సంకోచించే పౌరుల శాతం జనవరి మొదటి వారంలో 69 శాతం నుంచి జనవరి 25 నుంచి వారానికి 62 శాతానికి తగ్గింది. భారతీయ పౌరులలో వ్యాక్సిన్ వద్దు అనడానికి దుష్ప్రభావాలపై అనిశ్చితి ప్రధాన కారణమని సర్వేలో తేలింది. పౌరులలో 59 శాతం మంది కోవిడ్ -19 వ్యాక్సిన్ పట్ల ఆసక్తిగా లేరని వెల్లడి అయింది. 14 శాతం మంది టీకాల సమర్థతపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version