చికెన్ ను ఎక్కువగా తినేవారికి దిమ్మతిరిగే న్యూస్..ప్రాణాలకు ముప్పే..

-

నాన్ వెజ్ ప్రియులకు చికిన్ అంటే ఇష్టం..ఎక్కువ మంది చికెన్ ను తినడానికి ఇష్టపడతారు.అయితే కొన్ని వంటకాలను తింటే ఆరోగ్యం పాడవుతుంది.. ఇంకా ప్రాణాంతకరమైన వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాంటి వాటిలో ఒకటి తందూరి చికెన్ ఒకటి.దీన్ని నిప్పుల మీద కాలుస్తారు.. అయితే ఎక్కువగా దీన్ని తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

మాంసాన్ని నేరుగా మంట మీద పెట్టి కాల్చడం వల్ల దాని పై పొరపై క్యాన్సర్ సమ్మేళనాలు ఏర్పడే ప్రమాదం ఉంది. కండలు పెరిగేందుకు దోహద పడే ఆర్గానిక్ యాసిడ్ అధిక మంట మీద వేడి చేసినప్పుడు క్యాన్సర్ కి కారణమయ్యే హెటెరోసైక్లిక్ అమైన్‌లుగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే అవి కాలుతున్నప్పుడు వాటి కొవ్వు నిప్పు మీద పడుతుంది. ఇది పాలీ సైక్లిక్ ఆరోమెటిక్ హైడ్రోకార్బన్ లకి దారితీస్తుంది..ఇలా తీసుకుంటే మాత్రం క్యాన్సర్ వచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు..

కాల్చిన మాంసాన్ని తినడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని మిన్నేసోటా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం బాగా స్టీక్ చేసిన ఆహారం తినని వారితో స్టీక్ చేసిన ఆహారం తినే వాళ్ళని పలిస్తే 60 శాతం మందికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. మయి క్లినిక్ ప్రకారం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ దాని ప్రారంభ దశల్లో గుర్తించడం చాలా కష్టం. అది ఇతర అవయవాలకి వ్యాపించి ప్రాణాలు కూడా పోతాయని హెచ్చరిస్తున్నారు.

అయితే, ఈ ప్రమాదం నుంచి బయట పడాలి అంటే మాత్రం మాంసాన్ని కాల్చి వండుకోవాలని అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి కొంతవరకు బయటపడొచ్చు. వంట చెయ్యడానికి ముందు ఎప్పుడు దాన్ని మెరినేట్ చెయ్యాలి. మాంసాన్ని తందూరి లేదా బార్బేక్యూ పద్ధతిలో వండటానికి ముందు కనీసం కనీసం 30 నిమిషాల పాటు మెరినేట్ చేయాలని సిపార్సు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మాంసం మరింత రుచిగా మారాడమే కాకుండా కాల్చేటప్పుడు బాగుంటుందట..

వంట చేసే ముందు గ్రిల్ ని శుభ్రంగా చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మునుపటి వంట నుంచి మిగిలిపోయిన మాడిపోయిన పదార్థాలలో క్యాన్సర్ తాలూకు కారకాలు ఉండే అవకాశం ఉంది. కాల్చిన ఆహారాన్ని సరిగా కడిగిన తర్వాత దాన్ని కొద్దిగా నూనె రాసుకోవడం ఉత్తమం. ..అలా చెయ్యడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు..ఇది తప్పక గుర్థుంచుకోవాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version