ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 7 వేల మంది వరకు ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. దీని తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. దీనితో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కూడా దీనిపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ప్రతీ విమానంలో వచ్చిన ప్రయాణికులు అందరిని తనిఖీ చేస్తున్నాయి.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, కలకత్తా, ఢిల్లీ, లక్నో ఇలా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కూడా దీనిపై పరిక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. అంత వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. బీర్ బ్రాండ్స్ లో కరోనా అని ఒక బ్రాండ్ ఉంటుంది. కాస్త ఖరీదు కూడా ఎక్కువే. అన్ని బ్రాండ్లతో పోలిస్తే దీని క్వాంటిటీ కూడా తక్కువగానే ఉంటుంది.
అయితే కరోనా వైరస్ దెబ్బకు కరోనా బ్రాండ్ బీర్ తాగడం మానేశారు జనం. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జియో వైరస్ వస్తే జియో సిం లు తీసి పక్కన పడేస్తారా అంటూ కామెంట్ చేస్తున్నారు పలువురు. టాటా వైరస్ వస్తే టాటా వస్తువుల వాడకం ఆపేస్తారా అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ వైరస్ దెబ్బకు జనాల్లో ఎక్కడ లేని భయాలు బయటకు వస్తున్నాయి.