వైజాగ్ లో ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్.. ఆకట్టుకుంటున్న రామ్ చరణ్ లుక్స్

-

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులు చాలాకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.గేమ్ చేంజర్ రాంచరణ్ నటిస్తున్నటువంటి 15వ చిత్రం  ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతోంది.

ఓ రాజకీయ సభకు సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా అందులో రామ్ చరణ్, హీరోయిన్ కియారా నటించనున్నారు. అభిమానులు ఈ వీడియోను షూట్ చేసి ట్విటర్ లో షేర్ చేయడంతో వైరలవుతోంది. ఇందులో రామ్ చరణ్, కియారా లుక్ ఆకట్టుకుంటున్నాయి.ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో శ్రీకాంత్, అంజలి, సునీల్, సముద్ర ఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version