మోక్షజ్ఞ సినిమా షూటింగ్‌..అందుకే ప్రారంభం కాలేదు : బాలకృష్ణ

-

తన కుమారుడు మోక్షజ్ఞ సినిమా షూటింగ్‌ ప్రారంభోత్సవం ఆలస్యం కావడంపై ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తాజాగా స్పందించారు.గతేడాది కిందటే మోక్షజ్ఞ సినిమా ప్రారంభం కావాల్సి ఉన్నది.కానీ, వరుసగా పోస్టు పోన్ అవుతూ ఉంది.తాజాగాదీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. నందమూరి నటసింహం బాలయ్య స్పందిస్తూ.. ‘మోక్షజ్ఞ ఆరోగ్యం బాగోలేదు. అందుకే అతని సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు’అని క్లారిటీ ఇచ్చారు.

వాతావరణం బాలేని కారణంగా సీజనల్ వ్యాధులు వస్తున్నాయని, తనకు కూడా అలాగే బాధపడుతున్నాడని పేర్కొన్నారు. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలని బాలకృష్ణ చెప్పారు.కాగా, మోక్షజ్ఞ మూవీని గతంలో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తారని టాక్ వినిపించగా.. తాజాగా హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనే బాలయ్య వారసుడిని లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Latest news