జగిత్యాల జిల్లాలో యూరియా కొరత కొనసాగుతూనే ఉన్నది. దీంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పంటలు మిడిల్ దశకు రావడంతో యూరియా వేయకపోతే దిగుబడి రాక నష్టపోవాల్సి వస్తుందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తతం చేస్తున్నారు.
జిల్లాలోని గొల్లపల్లి మండల కేంద్రంలో రైతులు ఉదయం నుంచే వేచిచూస్తున్నారు. ఎండలు దంచుతుండటంతో క్యూ లైన్లో పాస్ బుక్కులు, ఆధార్ కార్డులు ఉంచి నీడపట్టున ఉన్నారు. యూరియా కేంద్రాల వద్ద రైతులు బారులు తీరడంతో పూర్తిస్థాయిలో ఇంకా యూరియా అందలేదని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో యూరియా కొరత లేదని చెబుతుండటం గమనార్హం.