శ్రీ ముఖీ.. నేను చూసిన శ్రీదేవి నువ్వే.. కామెంట్లతో ముంచెత్తుతున్న అభిమానులు..!

-

బుల్లితెర రాములమ్మ అలియాస్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై స్టార్ సీనియర్ యాంకర్ సుమ తర్వాత అంత క్రేజ్, పాపులారిటీ దక్కించుకున్న యాంకర్ శ్రీముఖి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులను అలరించిన శ్రీముఖి ఆ తర్వాత పలు ఎంటర్టైన్మెంట్ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతోమందిని తన వశం చేసుకుంది. మరొక పక్క సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఏకంగా స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.

మరోవైపు నిత్యం గ్లామర్ ఫోటోషూట్లతో యువతను గిలిగింతలు పెట్టే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరొకసారి రెయిన్బో కలర్ దుస్తుల్లో తన అందాలతో యువతకు గిలిగింతలు పెట్టింది. తాజాగా రెయిన్బో ని తలపించే లెహంగాలో ఫోటోషూట్ చేసి ఫోటోలు షేర్ చేసింది.. ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఆసం పిక్స్ అని షార్ట్ కట్ లో కామెంట్ షేర్ చేసింది శ్రీముఖి.. ఈ ఫోటోలు చూసిన కొంత మంది నెటిజన్స్.. ” నేనైతే శ్రీదేవిని చూడలేదు.. నేను చూసిన శ్రీదేవి నువ్వే” అంటూ బెస్ట్ కాంప్లిమెంట్ ఇస్తున్నారు. మరికొంతమంది గాడ్జియస్ , లవ్లీ బ్యూటీ అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు.

అయితే అంతా బాగున్న మరొక నెటిజన్ మాత్రం కొంటె కామెంట్ తో ఆమెను కొద్దిగా హార్ట్ చేశాడని చెప్పాలి.. శ్రీముఖి గారు మీ ఫేస్ పై కిలో మేకప్ ఉంది. మళ్లీ ఎందుకు ఆ ఫోజులు అంటూ వెటకారంగా కామెంట్ చేశారు.. ఇకపోతే శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోలు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి ..అంతేకాదు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆమెపై తమ ప్రేమను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా హీరోయిన్ పీస్ అని చెప్పడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version