ఇష్టం మూవీతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ శ్రియ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తనదైన అందం, అభినయం, అంతకుమించిన నటన, ప్రతిభతో తెలుగుతోపాటు తమిళ్, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లోనూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది.
2018లో రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు వ్యాపారవేత్త అండ్రి కొచ్చివ్ ను గప్ చుప్ గా వివాహం చేసుకుంది. ఈ దంపతులకు లాక్ డౌన్ సమయంలో పండంటి ఆడబిడ్డ జన్మించింది.
ప్రస్తుతం శ్రీయ పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది.
హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది.