శ్రుతి హాసన్ ‘’షీ ఈజ్‌ ఏ హీరో’’ సాంగ్ రిలీజ్

-

ఓవైపు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నా తనకు ఇష్టమైన మ్యూజిక్ కోసం తప్పకుండా టైం కేటాయిస్తూ ఉంటుంది శ్రుతి హాసన్. నటిగానే కాకుండా మ్యూజిక్ కంపోజర్, సింగర్‌గా తనని తాను ఎప్పుడూ ప్రూవ్ చేసుకుంటుంది. ఇప్పటికే పలు ప్రత్యేక వీడియో సాంగ్స్‌ను విడుదల చేసింది. సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉండటం. కరోనా వల్ల రెండేళ్లు పాటలకు, మ్యూజిక్‌కు దూరంగా ఉన్న శ్రుతి.. తాజాగో ఓ సూపర్ హిట్ సాంగ్ రిలీజ్ చేసింది.

“షీ ఈజ్ ఏ హీరో” అంటూ సాగే ఈ పాటను స్వయంగా శ్రుతి ఆలపించింది. పురుషహంకార సమాజంలో తమను తాము రక్షించుకుంటూ.. తమ హక్కుల కోసం పోరాడుతూ.. రోజురోజుకు మరింత స్ట్రాంగ్‌గా నిరూపించుకుంటున్న మహిళలకు తన సాంగ్‌ని డెడికేట్ చేస్తున్నట్లు శ్రుతి చెప్పింది. మహిళగా ప్రస్తుతంతో పాటు గతాన్ని, భవిష్యత్తుని కూడా దృష్టిలో పెట్టుకుంటానని అన్నది. ‘ఈ పాటకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. పాట నచ్చితే నేను నటిస్తున్న సినిమాల్లో కూడా పాడతాను’’’అని చెప్పింది శ్రుతి. ఆమె తెలుగులో ప్రభాస్‌ సలార్‌తో పాటు చిరంజీవి 154, బాలకృష్ణ 107వ సినిమాల్లో నటిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version