క్రమం తప్పని శృంగారంతో ఎన్ని లాభాలో..!

-

శృంగారం అనేది ఒక సృష్టి కార్యం. భూగోళంపై ఉన్న సమస్త జీవజాతి మనుగడకు శృంగారమే ప్రధానం. అయితే కొంతమంది ఈ శృంగారాన్ని కేవలం రెండు శరీరాల కలియికగా భావిస్తారు, కానీ దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి వారికి ఏమాత్రం అవగాహన ఉండదు. వాస్తవానికి శృంగారంతో ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉంటాయంటున్నారు సెక్సాలజీ నిపుణులు.

శృంగారంవల్ల మానసిక ప్రశాంతత, ఉల్లాసం కలుగుతాయట. శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుందట. మెదడు చురుకుగా పనిచేస్తుందట. అంతేకాదు శృంగారంవల్ల ఒత్తిడి కూడా తగ్గుతుందట. హృదయ సంబంధ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయట. అయితే మలి వయసులో శృంగారాన్ని ఆస్వాదించే వారిలో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయట. వారిలో మతిమరుపు దరిచేరదట. పైగా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తారట.

అంతేకాదండి బాబూ.. మలి వయసు వారు క్రమం తప్పకుండా శృంగారం చేస్తే కలిగే లాభాలు అన్నీఇన్నీ కావట. ఇది నేను చెబుతున్న మాట కాదు, పరిశోధకులు తేల్చిన విషయం. మలి వయసులో గుండె సంబంధ రోగాలతో బాధపడుతున్న వారికి శృంగారం ఒక దివ్యౌషధంలా పనిచేస్తుందట. గుండె రోగులు వారానికి ఒకసారైనా శృంగారాన్ని ఆస్వాదిస్తే ఎక్కువ కాలం జీవిస్తారట. క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనేవారిలో మరణాల రేటు కూడా తగ్గుతుందట.

పరిశోధకులు 65 ఏండ్లలోపు వయసున్న వారిని ఎంపిచేసుకుని, వారి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఒక నివేదిక రూపొందించారు. ఆ రిపోర్టు ప్రకారం.. వారానికి ఒకసారి క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనే వారిలో మరణాల రేటు 37 శాతం తగ్గగా.. వారానికి ఒకటి కంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనే వారిలో మరణాల రేటు 33 శాతం తగ్గిందట.

అయితే వారానికి ఒకసారి కూడా శృంగారంలో పాల్గొనని వారిలో మాత్రం మరణాల రేటు కేవలం 28 శాతమే తగ్గిందట. దీన్నిబట్టి మలి వయసులో శృంగారంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం క్రమం తప్పకుండా శృంగారాన్ని ఆస్వాదించండి.. ఆరోగ్యంగా, ఆనందంగా జీవితం గడపండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version