డైరెక్టర్ పై దురుసుగా ప్రవర్తించిన “డీజే టిల్లు” హీరో సిద్దు!

-

సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన “డీజే టిల్లు” చిత్రం ఫిబ్రవరి 12న రిలీజ్ అయి అట్లంటది ప్రేక్షకుల తోటి అనేలా చేసింది.లైఫ్ బిఫోర్ వెడ్డింగ్, గుంటూర్ టాకీస్, మా వింత గాధ వినుమా,కృష్ణ అండ్ హిజ్ లీలా చిత్రాలలో నటించి మెప్పించాడు సిద్దు జొన్నలగడ్డ.ఈ యంగ్ హీరోకు డీజే టిల్లు ఈ సినిమాతో సుమారు 12 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో గుర్తింపు వచ్చింది.దీంతో సిద్దు తన తదుపరి ప్రాజెక్టు పై ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.ఈ క్రమంలోనే ఇదివరకు ఒప్పుకున్న ఓ సినిమాను ఇప్పుడుు చేయనని అంటున్నాడట.మలయాళ సూపర్ హిట్ చిత్రం “కప్పేలా” రీమేక్ లో సిద్దు ఓ కీలకపాత్ర చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.డీజే టిల్లు మూవీ నిర్మించిన అదే బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.

శౌరి చంద్రశేఖర్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ను కాపాడే మరో హీరో పాత్రలో సిద్దు ను సెలెక్ట్ చేసారట.హీరోలు కొద్దిసేపే ఉన్నా సినిమాలో చాలా ప్రభావం చూపిస్తుందట.అయితే ఇప్పుడిప్పుడే స్టార్ గా ఎదుగుతున్న క్రమంలో మళ్లీ ఇలాంటి పాత్రలు చేస్తే తన పాపులారిటీ తగ్గిపోతోందని సిద్ధూ భయపడుతున్నాడని టాక్.అందుకే ఈ రీమేక్ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టామని, అగ్రిమెంట్ పై కూడా సంతకం చేసి ఎలా తప్పుకుంటాడని డైరెక్టర్ నిలదీయడంతో సిద్దు కొంచెం దురుసుగా ప్రవర్తించాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version