సీదిరి..కేరాఫ్ పలాస ‘మంత్రి’..!

-

రాజకీయంగా మంచి మంచి అవకాశాలు అరుదుగా వస్తూ ఉంటాయి…అలాంటి అరుదైన అవకాశాలు వచ్చినప్పుడు వాటిని నిలబెట్టుకోవాలి. కానీ కొందరు నేతలు వచ్చిన మంచి అవకాశాలని దుర్వినియోగం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు…ఇలా చేయడం వల్ల రాజకీయంగా చాలా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో మంత్రి సీదిరి అప్పలరాజుకు కూడా అదే పరిస్తితి ఎదురయ్యేలా ఉంది.

2019 ఎన్నికల ముందు వరకు అప్పలరాజు అంటే ఎవరో..ప్రజలకు తెలియని పరిస్తితి. కానీ ఆ ఎన్నికల్లో జగన్ వేవ్‌లో బలమైన గౌతు ఫ్యామిలీకి చెక్ పెట్టి అప్పలరాజు ఎమ్మెల్యేగా గెలిచారు. పలాస నియోజకవర్గంలో గౌతు శ్యామ్ సుందర్ శివాజీ వారసురాలు గౌతు శిరీషపై అప్పలరాజు విజయం సాధించారు. ఇలా మొదట విజయం దక్కించుకోవడం చాలా గొప్ప విషయం.

ఇక అంతకంటే గొప్ప విషయం ఏంటంటే…తొలిసారే మంత్రి పదవి దక్కించుకోవడం. మండలి రద్దు నేపథ్యంలో మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో..సీదిరికి మంత్రి పదవి దక్కింది. పశుసంవర్ధక శాఖ దక్కింది. అయితే అప్పలరాజు మంత్రి అయ్యాక…తన శాఖకు సంబంధించి ఎలాంటి పనులు చేశారో తెలియదు గాని…మీడియాలోకి వచ్చి చంద్రబాబుని తిట్టడంలో మాత్రం ముందున్నారు.

ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే..అప్పలరాజు మంత్రిగా ఉంటే…రాష్ట్ర స్థాయిలో పనిచేయకుండా..కేవలం తన నియోజకవర్గం పలాసకే పరిమితమయ్యారు. అయితే మీడియాలో కనిపించడం లేదంటే పలాసలో ఉండటం. ఇక అక్కడ ఉండే తన మంత్రి పవర్స్ అన్నీ ప్రతిపక్ష టీడీపీపై ప్రయోగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అక్కడ దూకుడుగా పనిచేస్తున్న టీడీపీ నాయకురాలు గౌతు శిరీషకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. పూర్తిగా ఆమెని, టీడీపీ శ్రేణులని టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కూడా టీడీపీ కార్పొరేటర్ టార్గెట్‌గా రాజకీయం నడిపించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కార్పొరేటర్‌గా అండగా వెళ్ళిన లోకేష్‌ని పోలీసుల చేత అరెస్ట్ కూడా చేయించరనే ఆరోపణలు ఉన్నాయి. అంటే రాష్ట్ర మంత్రిగా ఉన్న అప్పలరాజు…కేవలం పలాస మంత్రిగానే పనిచేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అంటే అక్కడ టీడీపీ బలం పెరుగుతుందనే భయమో..లేక బయటకు వెళితే తనపై వ్యతిరేకత పెరుగుతుందనే భయమో తెలియదు గాని…మొత్తానికి తన శాఖకు సంబంధించి రాష్ట్రానికి సేవలు చేయాల్సిన అప్పలరాజు…పలాసకే పరిమితమై..తన అధికారాలని ఉపయోగించి టీడీపీని దెబ్బతీయడానికి చూస్తున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version