ఇప్పటికి హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో స్వాతీ దీక్షిత్, కుమార్ సాయి మధ్యలోనే వెళ్లిపోయారు. కానీ అవినాష్ మాత్రం తనదైన శైలిలో నవ్విస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఆరోగ్య కారణాల వల్ల నోయెల్ ఇంటి నుంచి బయటికి వచ్చేశాడు. ఆ లోటుని భర్తీ చేసేందుకు మంగ్లీని రంగంలోకి దించేస్తున్నారు. ఈ శనివారం నాగార్జునే స్వయంగా మంగ్లీని హౌస్‌లోకి పంపించబోతున్నట్టు తెలుస్తోంది.
బిగ్‌బాస్ సీజన్ 4 ప్రారంభంలోనే మంగ్లీ పేరు వినిపించినా చివరి నిమిషంలో ఎందుకని ఆమెని పక్కన పెట్టారో ఎవరికి అర్థం కాలేదు. కానీ తాజాగా ఆమె తప్ప మరో ఆప్షన్ లేకపోవడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మంగ్లీని హౌస్‌లోకి స్వాగతం పలికేస్తున్నారు. తనదైన స్టైల్లోపాటలతో ఆకట్టుకునే మంగ్లీ హౌస్‌లో ఏరేంజ్‌లో రచ్చ చేస్తుందో చూడాలి.